Surprise Me!

Pulivendula ZPTC : పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లు, ఓటెయ్యనివ్వండి సార్ అంటూ.. | Oneindia Telugu

2025-08-12 62 Dailymotion

Pulivendula ZPTC :కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అవినాష్‌ను పోలీసులు కడపకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులపై అవినాష్ మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా తనను అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు చేస్తున్నారని.. దాడులు ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకుంటూన్నారని ఆరోపించారు. ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదన్నారు. బయటి వాళ్లు వచ్చి పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 10,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో మొత్తం 13 పంచాయతీలు ఉండగా 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది అభ్యర్థులు జెడ్పీటీసీలో బరిలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఐజీ కోయప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్ల తర్వాత పులివెందులలో కొన్ని చోట్ల దాడులు జరగడంతో ఇక్కడ 700 మందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత కోసం పోలింగ్ రూట్‌లో సీఐ స్థాయి అధికారి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐని ఏర్పాటు చేస్తున్నారు.

Kadapa ZPTC Elections 2025 are turning into a high-voltage political showdown! Pulivendula & Ontimitta are witnessing tense moments as YSRCP MP Avinash Reddy gets arrested, leaders put under house arrest, and heavy police security deployed. 🚨 With allegations of attacks, political accusations, and tight security measures, this election is no less than a mini war! Watch the full report for all updates from the ground — polling details, security arrangements, and political drama unfolding in real-time. 🗳️

Key Highlights:

Pulivendula & Ontimitta ZPTC polling today

YSRCP MP Avinash Reddy arrested

TDP & YSRCP leaders under house arrest

Heavy police deployment & security checks

700 police personnel in Pulivendula

15 polling centers, CI & SI-level monitoring

Tense atmosphere, political accusations flying

📅 Polling Time: 7 AM – 5 PM
📊 Votes: Pulivendula – 10,600 | Ontimitta – 24,600
👥 Candidates: 11 in each constituency

#Pulivendula #Kadapa #ZPTC #ZPTCElections #PulivendulaZPTCByElection #YSAvinashReddy #AvinashReddyArrest #YSRCP #TDP #PulivendulaElections #Ontimitta #Election2025

Also Read

పులివెందులలో ఏం జరుగుతోంది?- అడుగడుగునా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tight-security-in-pulivendula-during-zptc-bypoll-447475.html?ref=DMDesc

అవినాష్, సతీష్ రెడ్డి అరెస్ట్: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/polling-begins-for-zptc-byelections-in-pulivendula-and-vontimitta-447471.html?ref=DMDesc

పులివెందుల ఎన్నికల్లో టర్నింగ్..! వైసీపీకి హైకోర్టు బిగ్ షాక్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/hc-turns-down-ysrcp-plea-against-polling-booth-changes-in-pulivendula-zptc-bypoll-447441.html?ref=DMDesc

~PR.358~CA.240~HT.286~

Buy Now on CodeCanyon